ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై న
Christian Song Lyrics
Teluguఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల
యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత||
1.
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై
తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని
జూడరే ||ఎంత||
2.
పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి
మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి
దేహము దాల్చి ||ఎంత||
3.
ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా
ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||
4.
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి