ఎందుకో నన్నింతగా ప్రేమించినావని
Christian Song Lyrics
TeluguEndhuko Nanninthaga Preminchinaavani
ఎందుకో నన్నింతగా ప్రేమించినావని (2)
ఎంత వెతికిన నాలో మంచెమీ లేదు
ఎంత తలచినా కారణం కనిపించలేదు (2)
అప: నా యేసయ్యా నీకెంత మనసయ్యా
నా జీవితానికే ఎంత ఘనతయ్యా (విలువయ్యా)
1 తల్లివలే ఆదరించువాడవు నీవే
తండ్రివలే ఓదార్చువాడవు నీవే (2)
నిన్నువలే లాలించు వారెవ్వరు లేరయ్యా
నిన్నువలే పాలించు వారెవరయ్యా (వేరెవరయ్యా)
2. కన్నీరు కార్చువేళ నాదరిచేరి
ఆ.. కన్నీటిని నాట్యముగా మార్చితివయ్యా (2)
నిన్నువలె స్నేహించు వారెవ్వరు లేరయ్యా
నిన్నువలె ప్రేమించు వారెవరయ్యా (వేరెవరయ్య)
3. కనురెప్ప పాటైన నన్ను మరువక
నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే 2)