ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహ
Christian Song Lyrics
Teluguఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ
నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని
దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||
1.
పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ
జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే
నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||
2.
భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో
నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి
నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||
3.
నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్
నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను
ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||