ఎడబాయని దేవా ఇమ్మానుయేలు ప్రభువా
Christian Song Lyrics
Teluguఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా అ.ప: స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును 1. నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినానీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా 2. నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుమునీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుముగడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా