ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా
Christian Song Lyrics
Teluguఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా
యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా
ఆ సామిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా
1. పరలోకం నుండి దొరా నరలోకం వచ్చిండు
మన సీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు
2. సెంతజేరినోళ్ళకంత సింతలన్ని బాపెనంట
ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసెనంట
3. సొరగానికి దారిసూప అడుగుబెట్టె భూమిమీద
మరణానికి బుద్దిసెప్ప కన్నుమూసె సిలువమీద
4. సక్కనయ్య మోముజూడ సిక్కులన్ని తీరిపోవు
మక్కువతో శరణువేడ బతుకంతా మనలగాయు
ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా — English