ఆపత్కాలమున
Christian Song Lyrics
Teluguఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2)
తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున||
నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు
నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2)
ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు
భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు
ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు