ఆరని ప్రేమ ఇది ఆర్పజాలని జ్వాల ఇది
Christian Song Lyrics
Teluguపల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది
అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది
అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది
ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది
2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి
క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది
నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది