ఆత్మ శృంగారించు కొమ్ము పాప గ
Christian Song Lyrics
Telugu1. ఆత్మ! శృంగారించు కొమ్ము
పాప గుహ వీడి పొమ్ము
వెల్గులోని కింకరమ్ము
తేజరిల్లు మీ దినము
"రక్షణాధి కారవిందు
నీకు జేయ బోవుముందు
భూదినంబు లేలు ఱేడు
నిన్ను జేర వచ్చు నేడు"
2. పెండ్లి కూతురెట్లు భర్త
నట్లు ప్రేమ జూపుకర్త
నాయ నెంతో జాలిగుండె
తోడ దల్పు దట్టు చుండె
"నా ప్రియుండ! వేగరమ్ము
ముద్దు బెట్ట నిమ్ము నన్ను"
అందు హృదయంబుతోడ
యేసునాద నాహ్వానించు.
3. శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు
జేయ గొండ్రు బల్ధనంబు
సర్వ శ్రేష్ఠమౌ వరంబు