ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాక
Christian Song Lyrics
Teluguఆగిపోదు నా పాట - గమ్యం చేరేదాకసాగుతుంది ప్రతిపూట - నా పరుగు ముగిసేదాక1. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను అలసటతో జోగినా శృతి తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును2. నా అడుగు జారినా కలవరము చెందను నా బలము పోయినా లయ తగ్గనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును3. శత్రువు ఎదురొచ్చిన ధైర్యమును వీడను మిత్రులు నను గుచ్చినా శ్రావ్యత పొనీయను ఎదురైన అవరోధం యేసే తొలగించును స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును