ఆరని ప్రేమ ఇది
Christian Song Lyrics
Teluguఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది (2)
అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది
అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని||
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది
బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది (2)
ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది (2)
కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది (2) ||ఆరని||