ఆకాశంబు భూమియు అంతట చీకటి యా
Christian Song Lyrics
Telugu1.
ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి
సమయమున ప్రార్థన చేతుము మా దేవా||
2.
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా
ప్రభువా గావుము గావుము నీ నీడన్||
3.
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే
గొలిచి నిద్రించున్||
4.
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా
చెన్నుగ యేసూగావుమా||
5.
నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి
విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||
6.