ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమ
Christian Song Lyrics
Teluguఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ
సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప
నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
1. ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి
మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
2. క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో
ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
3. పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ
డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
4. నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ
ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
5. జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను
గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||