ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు
Christian Song Lyrics
TeluguReference: ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడి. మత్తయి Matthew 17:5పల్లవి: ఆనందమానంద మాయెను - నాదు ప్రియకుమారుని యందు - మహాదానందఅను పల్లవి: నా తనయుని మాట వినండని శబ్దమొక్కటి యా మేఘములో ఉద్భవించె నద్భుతముగ1. ప్రేమించుచున్నాను నీతిని - దుర్నీతిని ద్వేషించినావు - నీవుఅందుచే నీతోటి వారికంటె - ఆనంద తైలముతో తండ్రి నిన్నుఅధికంబుగ నభిషేకించెను ǁమహానందమానంద2. అంత్య దినముల యందున - ఆ వింత కుమారుని ద్వరా - ఈమానవులతోడ మాట్లాడెను - సర్వంబునకు తండ్రి తనయునివారసునిగా నియమించెను ǁమహానందమానంద3. తనయుండె ఆ తండ్రి మహిమ - ఆ తత్వంపు రూపంబు తానేమహాత్మ్యమైనట్టి మాటచేత - నమస్తమును నిర్వహించుచుఅందరిలో అతి శ్రేష్టుండాయె ǁమహానందమానంద4. నీవు నాదు కుమారుండవు - నిన్ను ప్రేమించి కన్నాను నేను - నేడుదండిగ తనయుని ముద్దాడెను - నిండుగాయన నాశ్రయించుడిరండి రండి ధన్యులు కండి ǁమహానందమానంద5. విజ్ఞాన సంపాద లెల్లను - ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను - ఆసంతోషమును పరిశుద్ధత - నమాధానము నీతి శక్తియువిమోచన మాయెను యేసు ǁమహానందమానంద6. అందరికన్నా నీవెంతనో అతి సుందరుడవై యున్నావు - నీవునీ పెదవులమీద పోయబడి - నిండి యున్నది దయారసమునిన్నాశీర్వదించెను తండ్రి ǁమహానందమానంద7. దివ్య రారాజై కుమారుడు - ఒక వెయ్యి వర్షాలు పాలించును - మహాఅంతము లేని రాజ్యమేలును - ఎందరు జయంబు నొందుదురోఅందరును పాలించెదరు ǁమహానందమానంద
ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు — English