ఆహాఆఅంత్యతీర్పు నందున
Christian Song Lyrics
Teluguఆహా..ఆ...అంత్యతీర్పు నందున ...యేసూ నీ రక్షకుడే
మహాభయంకరమో ...సింహంబుగా నుండు
1. ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?.... ||ఆహా||
2. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును ||ఆహా||
3. మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను
ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ||ఆహా||
4. గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి
గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును ||ఆహా||
5. నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి ||ఆహా||
6. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో
ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు ||ఆహా||