పరిశుద్ధుడవై
Christian Song Lyrics
Teluguపరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడవై||
నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||