పుట్టినాడంట యేసునాథుడు
Christian Song Lyrics
Teluguతూరుపు దిక్కున చుక్క బుట్టె
దూతలు పాటలు పాడ వచ్చె (2)
చలి మంట లేకుండా ఎలుగే పుట్టె (2)
చల్లని రాతిరి కబురే తెచ్చె (2)
పుట్టినాడంట యేసునాథుడు
పాపములు తీసే పరమాత్ముడు (2) ||తూరుపు||
గొల్లలు జ్ఞానులు వేగిర వచ్చి
కొలిచినారు తనకు కానుకలిచ్చి
పశుల పాక మనము చేరుదాము
కాపరిని కలిసి వేడుదాము (2) ||పుట్టినాడంట||
చిన్నా పెద్దా తనకు తేడా లేదు
పేదా ధనికా ఎప్పుడూ చూడబోడు