ప్రభుకే స్తోత్రము
Christian Song Lyrics
Teluguప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును (2)
ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు||
దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము (2)
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం ||ప్రభు యేసు||