మార్గము నీవని
Christian Song Lyrics
Teluguమార్గము నీవని – గమ్యము నీవని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
సుగమమాయెనే జీవ యాత్ర
ప్రాణము నీవని – దేహము నీదని – (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా
చైతన్యమొందెనే జీవ యాత్ర
బాధల బరువులో – నిత్య నిరాశలో
శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2)
శాంతము నీవని – స్వస్థత నీవని (2)
నమ్మితి గనుక ఓ యేసు నాథా