మాటే చాలయ్యా
Christian Song Lyrics
Teluguమాటే చాలయ్యా యేసూ నాకు
నీ మాటలోనే జీవం ఉన్నది (2)
నీ మాట వల్లె జరుగును అద్భుతాలు
నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2)
నీ మాటకు సమస్తం సాధ్యమే (2) ||మాటే||
సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి
సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2)
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా
నీ మాటకు సమస్తం లోబడును (2) ||నీ మాట వల్లె||