మరువని నీదు ప్రేమతో
Christian Song Lyrics
Teluguమరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2) ||మరువని||
కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2) ||మరువని||