మూడునాళ్ళ ముచ్చట కోసం
Christian Song Lyrics
Teluguమూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా (2)
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)
మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలే బంధాలురా (2)
వల్లకాటి వరకేరా భవబంధాలు
అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2) ||మూడునాళ్ళ||