మారిపోయెనే
Christian Song Lyrics
Teluguమారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ
కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర
యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే||
సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా
దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2)
పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా
విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా
ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా
ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||