మోకాళ్ళ అనుభవము
Christian Song Lyrics
Teluguమోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2)
వెలిగే దీపానికి నూనె అవసరం
నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2)
నూనె లేని దీపము ఆరిపోవును
ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ||
శోధనలో పడకుండా ప్రార్ధించుము
శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2)
కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2)