మహిమగల తండ్రి
Christian Song Lyrics
Teluguమహిమగల తండ్రి – మంచి వ్యవసాయకుడు
మహితోటలో నర మొక్కలు నాటించాడు (2)
తన పుత్రుని రక్తనీరు – తడి కట్టి పెంచాడు
తన పరిశుద్ధాత్మను – కాపుగా వుంచాడు (2)
కాయవే తోటా – కమ్మని కాయలు
పండవే చెట్టా – తియ్యని ఫలములు (2) ||మహిమ||
నీతి పూత జాతి కర్త – ఆత్మ సుతా ఫలములు
నీ తండ్రి నిలువచేయు – నిత్య జీవ ఫలములు (2)
అనంతమైన ఆత్మ బంధ – అమర సుధా కాంతులు (2)