మంచే లేని నా పైన
Christian Song Lyrics
Teluguమంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు (2)
ఆదియంత మైనవాడవు – మానవుని రూపమెత్తావు (2)
పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి (2)
ఎంతగా .. ఎంతగా.. ఎంతగా స్తుతులు పాడినా
యేసు నీ ఋణము తీరునా (2) ||మంచే లేని||
లోకాలన్నీ ఏలే రారాజు వైన నీవు
సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు (2)
నీదెంత దీన మనస్సు
నా కెంత ఘనత యేసు (2) ||ఎంతగా||