మీరు బహుగా ఫలించినచో
Christian Song Lyrics
Teluguమీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో
శిష్యులై యుండెదరు (2)
నీరు కట్టిన తోటవలె
నీటి వూటవలె నుండెదరు (2)
క్షామములో తృప్తి నిచ్చి
క్షేమముగా మిమ్ము నడిపించును (2)
బలపరచును మీ యెముకలను (2)
అధికముగా ఫలించుడి (2) ||మీరు||