దీవించావే
Christian Song Lyrics
Teluguదీవించావే సమృద్ధిగా – నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా – నీ కోసమే నను బ్రతకమని
దారులలో.. ఎడారులలో.. సెలయేరులై ప్రవహించుమయా..
చీకటిలో.. కారు చీకటిలో.. అగ్ని స్తంభమై నను నడుపుమయా.. ||దీవించావే||
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో.. నా ఊసులలో.. నా ధ్యాస బాసవైనావే..