దినదినంబు యేసుకు
Christian Song Lyrics
Teluguదినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2)
ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2)
పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు||
మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2)
మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు||
ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2)
ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు||