దేవా మా కుటుంబము
Christian Song Lyrics
Teluguదేవా మా కుటుంబము – నీ సేవకే అంకితము (2)
ఈ శాప లోకాన – నీ సాక్షులుగా నిలువ
నీ ఆత్మతో నింపుమా (2) ||దేవా||
కాపరి మా యేసు ప్రభువే – కొదువేమి లేదు మాకు
మాకేమి భయము – మాకేమి దిగులు
నీకే వందనములయ్యా
లోబడి జీవింతుము – లోపంబులు సవరించుము
లోకాశలు వీడి – లోకంబులోన
నీ మందగా ఉందుము ||దేవా||