దివినేలు స్తోత్రార్హుడా
Christian Song Lyrics
Teluguదివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు (2)
మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు