దేవా నీ సన్నిధిలో
Christian Song Lyrics
Teluguదేవా నీ సన్నిధిలో నిలచి
దీనులమై మొరపెట్టుచున్నాము – (2) ||దేవా||
అపరాధులగు నీదు ప్రజల
నెపములన్నియు బాపి (2)
కృపాళుండగు యేసు ప్రభువా
కృపను జూపి రక్షించుమయా (2) ||దేవా||
చేసి యున్నాము నేరములెన్నో
చేసిన మేలులను మరచి (2)
మోసములలో బడియున్నాము
యేసుప్రభు జయమునిమ్ము (2) ||దేవా||