దేవుడే నాకాశ్రయంబు
Christian Song Lyrics
Teluguదేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన