దేవ దాసపాలక
Christian Song Lyrics
Teluguదేవ దాసపాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
దేవా దేవా దీన పోషకా ||దేవ||
లోక బాధ ఇరుకు శోధన నుండి
స్వీకరించినావు త్రియేక దేవుడా
స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ||
దిక్కులేని పాపి కొరకు నీ దేహం
మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందగా ||దేవ||