యెహోవాను స్తుతియించు
Christian Song Lyrics
Teluguయెహోవాను స్తుతియించు – ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి (2)
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను – బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి – గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||
ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు