యావే
Christian Song Lyrics
Teluguభయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)
యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2)
మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)