యెహెూవాయే నా బలము
Christian Song Lyrics
Teluguయెహెూవాయే నా బలము
యెహెూవాయే నా శైలము (2)
యెహెూవాయే నా కోటయు
యెహెూవాయే నా కేడెము
యెహెూవాయే నా శృంగము
యెహెూవాయే నా దుర్గము (2) ||యెహెూవాయే||
నా దీపము ఆరనీయక నన్ను వెలిగించెను
నా అడుగులు తడబడకుండా నన్ను నడిపించెను (2)
నా చేతులు యుద్ధము చేయ నాకు నేర్పించెను
నా పక్షమున తానేయుండి నన్ను గెలిపించెను (2) ||యెహెూవాయే||