యేసు వలె
Christian Song Lyrics
Teluguయేసు వలె నన్ను మార్చునట్టి – ప్రతి అనుభవముకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్ధపరచే – ప్రతి అవమానముకై స్తోత్రం (2)
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు – అపవాదిపై నాకు జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు – జీవజలమై నన్ను తృప్తి పరచావు
నీవే జీవజలము – తండ్రి… నీవే జీవజలము – (2)
నిత్యత్వముకై నన్ను నడిపించే – ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి – ప్రతి సమయముకై స్తోత్రం (2)
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు – నీ ముఖమును దర్శింప కారణమదే