కలములతో రాయగలమా
Christian Song Lyrics
Teluguకలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా (2)
ఆరాధింతును (4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)
ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)
దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||