కోటి కాంతుల వెలుగులతో
Christian Song Lyrics
Teluguకోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల||
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను