కన్నులతో చూసే ఈ లోకం
Christian Song Lyrics
Teluguకన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకం
దేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరం
నా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా
నా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం
అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడు
మహిమ పొందాలని ఘనత నొందాలని
వేవేల దూతలతో కొనియాడబడు దేవునికి
నువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)
తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2)