క్రైస్తవకర్షక కదిలిరావయ్యా కన
Christian Song Lyrics
Teluguక్రైస్తవకర్షక కదిలిరావయ్యా
కన్నులు తెరచి కానవేమయ్యా
1. మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును
విత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున
వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
2. ఆదిమ క్రైస్తవ బోధకుల వేదనతోను వాక్యంబు విత్తె
రోదనతోను రక్తంబును గార్చి ప్రాణంబులను
దానంబుజేసిరి ||క్రైస్తవ||
3. చల్లిన వాక్యము ఫలియింపను తొలకరి వర్షము
గురిపించెను విలువైన ఫలములు ఫలియించువరకు
కడవరి వర్షము కొరకు వేడుదం ||క్రైస్తవ||
4. పొలములు తెల్లబారె తేరిచూడు కాలము చాల
గతించిపోయె కోతయజమా నుడైన క్రీస్తుని
కోతవారిని పంప కోరివేడుదం ||క్రైస్తవ||
5. శత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు చల్లిపోయె