క్రొత్త యేడు మొదలు బెట్టెను
Christian Song Lyrics
Teluguక్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకు నందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను
క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట ప్రభుని సేవ
తత్తర పడకుండ జేయు టుత్తమొత్తమంబు జూడ ||క్రొత్త||
పొందియున్న మేలులన్నియు బొంకంబు మీర
డెందమందు స్మరణ జేయుడి
ఇందు మీరు మొదలుపెట్టు పందెమందు గెల్వ వలయు
అందముగను రవిని బోలి అలయకుండా మెలయకుండా ||క్రొత్త||