కన్నులనెత్తి పైరుల చూడు
Christian Song Lyrics
Teluguకన్నులనెత్తి పైరుల చూడు కోయగ లేరెవ్వరు (2)
ఓ యువకుడా! ఓ యువతీ! తినుచు త్రాగుచు సుఖింతువా? (2)
కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో (2)
ఆత్మీయ విజయముతో కొనసాగవా, నీ ప్రభుతో (2) ||ఓ యువకుడా||
మోయాబున్ విడిచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా? (2)
వినయమున దీనుడవై సేవింతువా ధన్యుడవై? (2) ||ఓ యువకుడా||
విశ్వాస ప్రార్థనచే క్షీణతను తొలగింప (2)
జనములలో ప్రభు మహిమ నిండ సాగెదవా ఫలమొంద (2) ||ఓ యువకుడా||