కన్నులుండి చూడలేవ
Christian Song Lyrics
Teluguకన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను (2)
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||
చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను (2)
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి||