కఠిన హృదయమా కరుగవ దేవుని గడువు
Christian Song Lyrics
Teluguకఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
1. ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||
2. సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన||
3. నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
4. దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన||
5. మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన||
6. ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ