కోప దినము వచ్చును పాపుల గుండె
Christian Song Lyrics
Teluguకోప దినము వచ్చును పాపుల గుండె పగులు కాలము వచ్చును శ్రీ పాల
యేసుని దాపునఁ జేరక మాపు రేపులు మహ పాపులకును గొప్ప ||కోప||
1. భువిలో రాల కర్రల పూజలఁజేయు చవి దేవుండ్లని చెప్పెడి అవిగాక
తమవంటి నరులదేవుండ్లని యవివేకముగ నమ్ము నరులందరికి
నెంతో ||కోప||
2. నరహంతకులు దొంగలు వ్యభిచారులు మరి యబద్ధికు లందఱు
ఇరుగు పొరుగు వారి నిఁక మోసములు చేయు నరులందఱు చెడ్డ
నరకములోఁ బడునట్టి ||కోప||
3. ఆట పాటలవల్లను పాపము చాల వేటాడుకొను వారలు బూట
కముల వారలు భువిలో యక్షిణిగాండ్రు మాటలాడక యగ్ని మడుగులో
బడి కాలే ||కోప||
4. కులభేదములు గల్పించి కుటిలమందు బలముగ బ్రతుకుచుండు
ఇల మాయవాదుల కిఁక నేమి గతిలేక పలుగొరుకులు నుండె బాధల
పాలయ్యెడు ||కోప||