క్షణమైన నీవు
Christian Song Lyrics
Teluguక్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2)
కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన||
పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2)
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి (2)
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన||