కనిపెట్టుచుంటిని ప్రభువా నీ సన్నిధినీ
Christian Song Lyrics
Teluguకనిపెట్టుచుంటిని.. ప్రభువా నీ సన్నిధినీ….
నిన్ను ఆశ్రయించితినీ .. శరణము నీవనీ…
దాసి కన్నులు చుస్తున్నట్లుగా నా కన్నులు నిన్ను చూచుచుండగా
దాసుడు ఆశతో నిలుచునట్లుగా
నీ యెదుట నేను నిలచి యుంటిని …
ప౹౹ నా కన్నీరు కాదనకూ…నన్నుచూడు ఈ క్షణం
నీ ఎన్నికను కృప నిలుపూ కీడు నుండి తప్పించూ ౹2౹ “కనిపెట్టు”
1. నీవు నాటిన మొక్కను నేను కాయుమూ క్షామము నుండి
నీకై పూసిన పువ్వును నేను దాయుమూ సుడిగాలులనుండి … (2)
ప్రార్థన వినవయ్యా ప్రాణేశ్వరుండా….
కనికర పడవయ్యా…. కారుణామయుండా… ౹నా కన్నీరు౹
2. నీవు రాసిన రాతను నేను నిలుపుమూ నీ రాకడవరకు
నీకై కూసిన కోయిల నేను చూడుమూ ఆశతో ఉన్నా (2)
నిందలచేత నిష్టురమయ్యా ఆదరణ చూపవా ఆరాదనీయుడా ౹నా కన్నీరు౹