సన్నుతింతు యేసు స్వామి
Christian Song Lyrics
Teluguసన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం
నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు||
సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును||