స్తుతించెదను స్తుతించెదను
Christian Song Lyrics
Teluguస్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము ||స్తుతించెదను||
ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2)
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2)
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2) ||స్తుతించెదను||
నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2)
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2)
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2) ||స్తుతించెదను||